![]() |
![]() |

ప్రియమణి అంటే ఇండస్ట్రీలో ఒక మంచి ఫేమ్ ఉంది. ఆమె ఎన్నో మంచి మంచి మూవీస్ లో గుర్తుండిపోయే రోల్స్ లో నటించింది. దాదాపు 20 పైగా సినిమాల్లో నటించి ఆడియన్స్ ని మెప్పించింది ప్రియమణి. పరుత్తివీరన్ లోని నటనకు 2006 లో జాతీయ ఉత్తమ నటి అవార్డుని అందుకుంది. అలాగే రావణ్ మూవీ ద్వారా హిందీ చిత్రసీమలోకి అడుగు పెట్టింది. ఈ మూవీలో ప్రియమణి నటన వేరే లెవెల్ అని చెప్పొచ్చు. తెలుగులో "ఎవరే అతగాడు" మూవీతో ప్రేక్షకులను పలకరించింది. తర్వాత ఎన్టీఆర్ తో యమదొంగ మూవీలో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
ఇక ఇప్పుడు భామ కలాపం మూవీతో ఆడియన్స్ ని అలరిస్తోంది. ఈ మూవీ సెకండ్ పార్టీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా టేస్టీ తేజతో కలిసి సందడి చేసింది. ఇక తేజ కూడా ఆమెను ఎన్నో ప్రశ్నలు వేసాడు. "ఢీ ఫామిలీలో మిమ్మల్ని మిస్ అవుతున్నాం.. అని ఒక ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు ప్రియమణి ఆన్సర్ ఇచ్చింది. మల్లెమాల ఫ్యామిలీ నాకు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలా అనిపిస్తుంది. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. నేను చాలామంది మిస్ అవుతున్నానని. ప్రదీప్, సుధీర్, రష్మీ, శేఖర్ మాస్టర్ అందరినీ మిస్ అవుతున్నాను.
నేను ఎక్కడికి వెళ్లినా కూడా మిమ్మల్ని ఢీ షోలో మిస్ అవుతున్నాం అని చెప్తూ ఉంటారు. ఆదితో కామెడీ చాలా వర్కౌట్ అయ్యింది. మీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నేను వాళ్లందరినీ మిస్ అవుతున్నాను. ఫ్యామిలీ మెన్ నెక్స్ట్ సీజన్ ఎప్పుడు అన్న మరో ప్రశ్నకు త్వరలో.. ఈ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాం అని ఆన్సర్ ఇచ్చింది. మీరు కంటిన్యూయస్ గా మూవీస్ చేయడం లేదు. మేము మీ మూవీస్ ని మిస్ అవుతున్నాం అని అడిగిన ప్రశ్నకు.. ఈ ఇయర్ చేస్తాను కంటిన్యూయస్ గా మూవీస్ వస్తాయి.. తెలుగులో కాకుండా అన్ని ల్యాంగ్వేజ్స్ లో కూడా. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ మూవీస్ లో నటించాను. ఇక నా డైట్ విషయానికి వస్తే అన్నీ తింటాను కానీ లిమిట్ గా తింటున్నాను" అని చెప్పింది ప్రియమణి. ఇక తేజ ఈమెతో పులిహోర చేయించి తిన్నాడు తినిపించాడు.
![]() |
![]() |